పాత పెన్షన్ విధానం అనేది కష్టసాధ్యమైన వ్యవహారమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఉద్యోగులకు కూడా వివరించామని తెలిపారు. సమస్యలుంటే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగులు, ఉద్యగ సంఘాల నుంచి సలహాలను స్వీకరిస్తాం. మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పరిశీలించి అలు చేస్తామని చెప్పారు మంత్రి బొత్స.
మరోవైపు రాష్ట్రంలో గడిచిన నాలుగున్నరేళ్ల వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మన ప్రభుత్వ పాలనలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఎంతో మేలు జరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలను సాకారం చేసుకున్నాం. సాగు నీటి ప్రాజెక్టుల మిగులు పనులను పూర్తి చేసుకుంటున్నాం. నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. ఎవరికైనా సమస్య వస్తే.. ఒకవైపే కాస్తున్నారు. అందరినీ సమ దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. వ్యక్తులు కాదు.. పార్టీ ముఖ్యం అన్న విషయాన్ని గ్రహించాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.