ఈ రోజు గౌహతి వేదికగా ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్యన జరగాల్సిన వార్మ్ అప్ కాస్తా వర్షం కారణంగా రద్దు అయినట్లు అంపైర్లు ప్రకటించారు. కేవలం ఈ మ్యాచ్ కు ముందు టాస్ మాత్రమే పడింది… టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ విధి ఈ మ్యాచ్ కు సహాయపడలేదు అని చెప్పాలి. నిర్విరామంగా వర్షం దాదాపుగా మూడు గంటలపాటు పడుతూనే ఉండడంతో ఇంతక కుదరదని భావించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. వాస్తవంగా అంపైర్లు మ్యాచ్ ను జరిపించాలని చాలా సేపు వెయిట్ చేసినా, ఇంతకీ వర్షం ఆగకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్ జరిగి ఉంటే చాలా బలమైన ఇంగ్లాండ్ జట్టు పైన ఇండియా ఎలా ఆడేదో తెలిసి ఉండేది. అప్పుడే మన బలాలు మరియు బలహీనతలు బయటపడి ఉంటాయి.
ముఖ్యంగా లోయర్ ఆర్డర్ ఇంకా బలపడాల్సి ఉంది మరియు సూర్య ఇంకా తానేమిటో నిరూపించుకుంటేనే తుది జట్లలో స్థానం దక్కే ఛాన్సెస్ ఉంటాయి. మరి మిగిలిన ఇంకొక వార్మ్ అప్ మ్యాచ్ లో ఇండియా ఆసియా కప్ లో తనను ఓడించిన బంగ్లాదేశ్ తో తలపడనుంది.