ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వృద్ధురాలు..!

-

పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం ఇచ్చేందుకు సత్తెనపల్లికి చెందిన ఓ వృద్ధురాలు ముందుకొచ్చారు. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే అందుకు తాను తన సొంత స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పల్నాడు జిల్లా, నకరికల్లు మండలం, కమ్మవారిపాలెంనకు చెందిన నరిశెట్టి రాజమ్మ సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి వదర బాధితుల సహాయార్ధం చెక్కు అందించేందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో తమ గ్రామంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఉన్నాయని, వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు మంజూరు చేస్తే అందుకు అవసరమైన 2 లేదా 3 సెంట్ల చొప్పున స్థలం సమకూర్చుతానని తెలిపింది. త్వరలో గృహ నిర్మాణ పథకం ప్రారంభం అవుతుందని, ఆ సమయంలో అధికారులు సంప్రదిస్తారని సీఎం చంద్రబాబు ఆమెతో అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చేందుకు ఉదారంగా ముందుకొచ్చిన రాజమ్మను సీఎం చంద్రబాబు అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news