కొండపైనా ఒక “ఆర్” ఉంది… అలజడి సృష్టిస్తోంది!

-

ప్రశాంతంగా ఉన్న వైకాపాలో తనదైన అలజడి సృష్టిస్తోంది మూడు “ఆర్” లు అయితే… తాజాగా తిరుపతి కొండపై కూడా ఒక “ఆర్” ప్రస్తుతం టీటీడీ లో అలజడి సృష్టిస్తోందని అంటున్నారు. జగన్ అదృష్టం ఏమిటో కానీ… అంతా జగన్ మనుషులే, అంతా జగన్ మా గుండెల్లో ఉన్నారు అనేవారే… కానీ విమర్శల విషయంలో మాత్రం మీడియాకు ఎక్కేస్తున్నారు.. అల్లర్లు చేసేస్తున్నారు! సమస్యను పరిష్కరించడం సంగతి దేవుడెరుగు.. కొండమీద ఏదో జరిగిపోతుందంటూ దాన్ని బూతద్దంలో చూపించేపనికి పూనుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి!!

వివరాళ్లోకి వెళ్తే… వైఎస్సార్సీపీ లో రఘురామకృష్ణంరాజు (ఆర్.ఆర్.ఆర్.) ఒకరకమైన అలజడి సృష్టిస్తే… కొండమీద రమణదీక్షితులు (ఆర్) ప్రస్తుతం అదేపనిమీద ఉన్నట్లుగా ఉన్నారు. కొండమీద ఇప్పటికీ చంద్రబాబు పెట్టిన మనుషులే పెద్దలుగా ఉన్నారని, ఇప్పటికే బాబు చెప్పినట్లే వారు నడుచుకుంటున్నారని బాంబు పేల్చిన దీక్షితులు… తాజాగా ట్విట్టర్ కి ఎక్కారు!

శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే అర్చకులలో 15 మంది కరోనా బారిన పడ్డారని.. ఇంకా 25 మందికి చెందిన ఫలితాలు రావాల్సి ఉందని.. దర్శనాలు నిలిపివేసేందుకు టీటీడీ అధికారులు నిరాకరిస్తున్నారని.. మాజీ సీఎం చంద్రబాబు పాటించిన విధానాలనే టీటీడీ అధికారులు పాటిస్తున్నారని.. ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోతే ఉపద్రవం చోటుచేసుకుంటుందని రమణ దీక్షితులు స్పందించారు! అనంతరం ఈ విషయాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు.

తాను ఇవ్వలనుకుంటున్న సలహాలు ఏమైనా ఉంటే.. రమణ దీక్షితులు పాలకమండలి దృష్టికి తీసుకురావాలని.. బహిరంగంగా విమర్శలు చేయడం సమంజసం కాదని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. రమణ దీక్షితులును గౌరవ ప్రధాన అర్చకులుగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నియమించారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసిన వైవీ… అర్చకుల విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని.. ఒకవేళ అర్చకులకు ఇబ్బంది కలిగితే దర్శనాలు నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు!!

Read more RELATED
Recommended to you

Latest news