ఏపీ లో కొనసాగున్న కరోనా కలకలం… నేడు కొత్తగా 7627 కరోనా కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో శాంపిల్స్ ను ఎక్కువ మోతాదులో పరిశీలించడంతో అధిక సంఖ్యలో కొత్త కేసులు బయట పడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. నిన్న ఒక్కరోజే 47,645 శాంపిల్స్ ను పరీక్షించగా, అందులో 7627 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,298 కు చేరుకుంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 48,956 కేసుల యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 3041 కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 46,301 కు చేరుకుంది. మరోవైపు పైపు తాజాగా కరోనా బారినపడి 54 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1041 కు చేరుకుంది. నేడు ఒక్కరోజే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 13,486 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version