మంత్రాలయంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిన ఘటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం లో రాఘవేంద్ర కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కుప్పకూలింది. ట్యాంక్ కూలిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
దీనిపై స్పందిస్తూ.. “కూలిన సమయంలో పరిసరాల్లో ఎవరూ లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. ఇటువంటి పరిస్థితులు ఇకపై తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నిర్మాణం నాణ్యతా ప్రమాణాలపై విచారణ చేసి నివేదిక శీఘ్రగతిన పంపించాలని ఆదేశించారు. అలాగే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకుల నాణ్యతను పరిశీలించి సమగ్ర నివేదికను అందించాలి” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు.