ఏపీలో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారు – ఓవైసీ

-

చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారని.. చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేశారు అసదుద్దీన్. సీఎం జగన్ పాలన మంచిగానే ఉందని చెప్పిన అసదుద్దీన్ చంద్రబాబును మాత్రం నమ్మలేమన్నారు.

owaisi comments on chandrababu
owaisi comments on chandrababu

ప్రజలు కూడా చంద్రబాబు ని ఎప్పుడూ నమ్మకండని కోరారు అసదుద్దీన్. అటు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్‌లో కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని రాహుల్‌ గాంధీకి ఒవైసీ సవాల్‌ విసిరారు.

1992వ సంవత్సరంలో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీని వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదును కూల్చివేశారని అసదుద్దీన్ పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news