గుడ్ న్యూస్ : నేటి నుంచి పాపికొండ‌ల యాత్ర పునఃప్రారంభం

ప‌ర్యాట‌కులు ఎక్కువ ఆస‌క్తి చూపే ప్ర‌దేశాల‌లో పాపి కొండ‌లు మొద‌టి స్థానం లో ఉంటుంది. ఎంతో అంద‌మైన పాపికొండ‌లు క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తి వ‌ల్ల ఇన్ని రోజులు మూసి ఉంది. అక్క‌డ ప‌ర్య‌టించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో చాలా రోజుల పాటు పాపికొండ‌లు బొసి పోయింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాపి కొండల ప‌ర్యాట‌ర ప్రాంతాన్ని తిరిగి ప్రారంభించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో పాపి కొండ‌ల ప‌ర్యాట‌క ప్రాంతం నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే పాపి కొండల ప‌ర్యాట‌క ప్రాంతం చాలా రోజుల త‌ర్వాత ప్రారంభం కావ‌డం తో అక్క‌డి స్థానికులకు పూర్వ వైభ‌వం వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ర్యాట‌కులు లేక ఆదాయం త‌గ్గిపోయిన వారికి ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో వారి జీవితం లో కూడా వెలుగు వ‌చ్చాయని చెప్ప‌వచ్చు. అయితే పాపి కొండ‌లలో ప‌ర్యాట‌కులు క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని కూడా అధికారులు సూచిస్తున్నారు.