నా వారాహి వాహనాన్ని ఆపండి.. ఆ తర్వాత నేను ఏంటో చూపిస్తా నని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ సత్తనపల్లి లో కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
తన వారాహి వాహనం పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. కచ్చితంగా ఏపీలో తన వారాహి వాహనం పై ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని, కానీ తాను ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఏపీలో ఓటును చీలకుండా చూస్తానని, తాను ఏదైనా తప్పు చేస్తే గళ్ల పట్టి అడగండి అంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.