Bigg Boss Tamanna fires on Pawan Kalyan: జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు తమన్నా. అయితే.. ఈ వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ తమన్నా కాదొండోయ్..బీసీవై పిఠాపురం అభ్యర్థి సింహాద్రి తమన్నా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ కాకినాడలో బీసీవై పిఠాపురం అభ్యర్థి సింహాద్రి తమన్నా మాట్లాడుతూ… పవన్ సీఎం అవుతాడు అనుకుంటే ఆయన మాత్రం చంద్రబాబు కోసం పని చేస్తున్నాడని ఆగ్రహించారు. జనసేన కోసం పనిచేసిన వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
జనసేన కండువా కప్పుకున్న టిడిపి నేతలకు సీట్లు ఇచ్చారని నిప్పులు చెరిగారు. జనసేన కోసం పనిచేసిన వాళ్ళు ఏడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తుల అమ్ముకొని పవన్ సీఎం అవ్వాలని పనిచేశారని.. కానీ జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు తమన్నా.