సీఎం జగన్ కు 151 సీట్లు దాటుతాయి – కొడాలి నాని

-

సీఎం జగన్ కు 151 సీట్లు దాటుతాయని ప్రకటించారు కొడాలి నాని. కృష్ణాజిల్లా, గుడివాడలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ వేశారు. ఇక నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 20 వేల కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని…. గద్దెనెక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు….మరో సారి గుడివాడలో విజయకేతనం ఎగురవేస్తానని ప్రకటించారు.

MLA Kodali Nani nominated as YSRCP candidate in Gudiwada

మళ్ళీ జగనే సిఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు….సంక్షేమ పథకాల ద్వారా మా కేటుంబాలకు సిఎం జగన్ చేసిన మంచికి మహిళమ్మ తల్లులందరు ఆయనకు మద్దతుగా ఉన్నారన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం…..అక్కడక్కడ టిడిపి వాళ్ళు రెచ్చ కొడుతున్నా మేము సమన్వయంతో ఉన్నామని చెప్పారు. ప్రజా స్వామ్యంలో….. ప్రజల ఇచ్చిన తీర్పు దైవ నిర్ణయం అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news