తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ కి యాత్రలు చేయడం అలవాటేనని అన్నారు. వారాహి అనే అమ్మవారిని వాహనంగా పెట్టుకోవడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర కాదు, వారాహి యాత్ర చేస్తున్నాడని గుర్తు పెట్టుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారని.. కానీ ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారని అన్నారు.
చెప్పు తీసుకొని కొడతా అని బూతులు మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడతారంట అంటూ ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ అంటే గాలి కళ్యాణ్ అని అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తిరగడం దుష్ట చతుష్టయం యొక్క పథకమేనన్నారు. కాపులను మచ్చిక చేసుకోవడానికి తిరుగుతున్నారని ఆరోపించారు. వాలంటరీ వ్యవస్థ పై గాలి కళ్యాణ్ కి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.