రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్…షెడ్యూల్‌ ఇదే

-

రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. రేపు కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్నారు పవన్.

Pawan Kalyan to Kondagattu tomorrow

రేపు ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్న కు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. వారాహి వాహనానికి కొండగట్టులోనే పూజలు నిర్వహించిన పవన్…అనంతరం… ప్రచారం కు వెళ్లారు.

ఇక అటు  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు అయ్యింది. జులై 1 నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. అదే రోజు (జులై 1న) సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూ. గో. జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పవన్ పాల్గొంటారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news