జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ CMగా బాధ్యతలు స్వీకరించారు. క్యాంప్ ఆఫీసులో వేదపండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. అనంతరం IAS, IPS అధికారులతో, మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో ఆయన భేటీ కానున్నారు. తర్వాత మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు జనసేనాని వెళ్లనున్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్ కు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.