రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్‌న్యూస్ చెప్పారు. ఆయిల్‌పామ్, అంతర పంటల రాయితీ డబ్బులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు సూక్ష్మ సేద్య కంపెనీలకు సైతం రూ.55.36 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని చెప్పారు. ఇకపై రైతులకు పంటల సాగు బకాయిలను ఎప్పటికప్పుడు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కాగా, ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై భేటీలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా, రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.