ఇవాళ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

ఇవాళ మచిలీపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నం లో మహాత్మాగాంధీ కి నివాళులర్పించనున్న పవన్ కళ్యాణ్.. అనంతరం వారాహి యాత్ర లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే.. కృష్ణాజిల్లా కార్యవర్గం తో భేటీ కానున్న పవన్ కళ్యాణ్.. అనంతరం సభలో ఎలాంటి విషయాలను మాట్లాడాలనే దానిపై చర్చించనున్నారు.

కాగా, పవన్‌ కల్యాణ్‌ నాల్గవ విడుత వారాహి విజయ యాత్ర నిన్న ప్రారంభమైంది. వారాహి విజయయాత్రలో భాగంగా నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ భవిష్యత్తు దృష్ట్యా ఈసారి ఓటు చీలనివ్వకూడదు… వైసీపీని దించేయడమే మా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. గత ఎన్నికల్లో నేను గెలిచుంటే ఇవాళ డీఎస్సీ అభ్యర్థులు ఇలా ప్లకార్డులు పట్టుకుని నిలుచోవాల్సిన అవసరం వచ్చేది కాదు. జగన్ వంటి వేల కోట్లు దోచేసిన తర్వాత కూడా ఇంకా దోచుకుంటూనే ఉన్నాడన్నారు.