కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు – పవన్ కళ్యాణ్

-

కార్మిక లోకానికి పవన్ కళ్యాణ్ మే డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ శక్తిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. చెమట చుక్కలు చిందించి శ్రామిక లోకం చేసే కష్టం. ఆర్థిక పురోగతికి ఇంధనం లాంటిదని వెల్లడించారు.

కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. దేశాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యాన్ని కలిగిన కార్మిక లోకానికి నా తరఫున, జనసేన పార్టీ పక్షాన మే డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని వివరించారు. సంఘటిత రంగంలోని కార్మికులు తమ బాధలు వెల్లడించుకొనేందుకు వేదికలు ఉన్నా వారి సమస్యలు ఎన్నో అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికుల సమస్యలు అనేకం నా దృష్టికి వచ్చాయని… కష్ట జీవుల పక్షాన ఎల్లవేళలా జనసేన నిలబడుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news