తెలంగాణ రాష్ట్రంలోని హోం గార్డులకు బిగ్ షాక్. తెలంగాణ రాష్ట్రంలోని హోం గార్డులకు ఈ నెల 13వ తేదీ దాటినా ఇంకా అందలేదు వేతనాలు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హోం గార్డులు.

తెలంగాణలో ప్రస్తుతం సుమారు 16 వేల మంది హోంగార్డులు.. బందోబస్తు డ్యూటీలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సభలు, సమావేశాలు, ఎన్నికల విధుల్లో పోలీసులతో సమానంగా వారు విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించడం లేదు.
టీఏ, డీఏ, హెచ్ఎర్ఎలతోపాటు యూనిఫాం అలవెన్స్ సైతం ఇవ్వట్లేదని సమాచారం. రిటైరైనా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించట్లేదు.. ప్రభుత్వం ఇటీవల హోంగార్డులకు హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించినా ఆ ప్రక్రియ ఇంకా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .