నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ ఫోన్

-

నారా లోకేష్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదాం అని లోకేశ్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… చంద్రబాబు కుటుంబానికి భరోసా కల్పించారు. జగన్‌ సర్కార్‌ గురించి భయపడవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.

pawan phone call to nara lokesh
pawan phone call to nara lokesh

కాగా, రాజమండ్రిలో సెక్షన్‌ 30 అమలు చేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చంద్రబాబు తరలించారు. ప్రత్యేక భద్రత తో జైలుకు చంద్రబాబును పంపారు. అలాగే జైలు లో ఖైదీ నంబర్‌ 7961 కేటాయింపు చేశారు అధికారులు. చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.. ఇంటి భోజనంతో పాటు మెడిసిన్‌కు అనుమతి ఇచ్చారు పోలీసులు. భద్రతా కారణాల వల్ల మిగిలిన ఖైదీలతో కాకుండా ప్రత్యేక గదిలో ఉంచాలని ఆదేశించారు ఏపీ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news