అనకాపల్లి ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అనకాపల్లి ప్రమాదం చాలా బాధాకరమన్నారు. అనకాపల్లి ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదని వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్యాక్టరీ యాజమాన్యం లో ఇద్దరు ఉన్నారు, వారు కూడా బాధ్యత తీసుకోవటం లేదని చెప్పారని తెలిపారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని నేను రాగానే చెప్పానన్నారు.
సేఫ్టీ ఆడిట్ అనగానే ఫ్యాక్టరీ యజమానులు భయపడుతున్న పరిస్థితి ఉందని వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు మూసేస్తారని భయం యజమానులలో ఉందన్నారు. పరిశ్రమల అవసరం ఉంది..పరిశ్రమల్లో పనిచేసే వారి ప్రాణ రక్షణ కూడా చాలా ముఖ్యమని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధానంగా విశాఖలో తరచుగా జరుగుతున్న ప్రమాదాలను తగ్గించటానికి సేఫ్టీ ఆడిట్ జరపాల్సిన అవసరం ఉందని… పొల్యూషన్ ఆడిట్ ను త్వరలోనే చేపడతామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటు ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది సర్కార్.