చంద్రబాబుపై పోటీ చేస్తా.. కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తా : పెద్దిరెడ్డి

-

చంద్రబాబుపై పోటీ చేస్తా.. కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తానని సవాల్‌ విసిరారు పెద్దిరెడ్డి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పుంగనూరులో టిడిపి నేతలు అరాచకాలు చేస్తే, చూస్తూ సహించాలా? అని ప్రశ్నించారు. తనను చంద్రబాబునాయుడు హెచ్చరించడం హాస్యాస్పదం అన్నారు.

కాంగ్రెస్ హయాం నుంచి చిత్తూరు జిల్లాలో టిడిపి మెజార్టీ సాధించలేదని గుర్తు చేశారు.ఈ సారి కుప్పంలోను చంద్రబాబు జెండాను పీకేస్తామని స్పష్టం చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, ఆ కులానికి సంబంధించిన వంగవీటి రంగా ను చంపించింది చంద్రబాబు కాదా? అని నిలదీశారు. భోగి మంటల్లో కాల్చాల్సింది జీఓ నెం.1 ని కాదు, సీఎం కావాలనే తాపత్రయాన్ని కాల్చుకోవాలి.. కేఏ పాల్ లాగా చంద్ర బాబు కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version