నేడు హైదరాబాద్​కు చివరి నిజాం ప్రిన్స్‌ భౌతికకాయం

-

ఏడో నిజాం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ మనవడు, చివరి నిజాం ప్రిన్స్‌ మీర్‌ అలీఖాన్‌ ముకర్రమ్‌ ఝా బహదూర్‌ (మీర్‌ బరాకత్‌ అలీఖాన్‌) (89) తుర్కియేలో కన్నుమూశారు. శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని మంగళవారం ఇస్తాంబుల్‌ నుంచి శంషాబాద్‌కు తీసుకురానున్నారు. సాయంత్రం 5 గంటలకు విమానాశ్రయం నుంచి చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకొస్తారు.

బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాధారణ ప్రజలు భౌతికకాయాన్ని చూసే అవకాశం కల్పిస్తారు. 3 గంటల తర్వాత మక్కామసీదుకు తరలిస్తారు. ముకర్రమ్‌ ఝా కోరిక మేరకు ఆయన తండ్రి అజమ్‌ఝా సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version