మదనపల్లె దస్త్రాల దహనం కేసుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో పెద్దిరెడ్డి పేరును తెర పైకి తీసుకువచ్చింది టీడీపీ. అయితే, మదనపల్లె దస్త్రాల దహనం కేసుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతా బూటకమే అంటూ ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మాలాంటి వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు..
కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.
మాలాంటి వల్ల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..మదనపల్లి లో రికార్డులు తగలబడ్డాయని అంటున్నారని చెప్పారు. అదికూడా మేమే చేశామని ఆరోపిస్తున్నారు..ఒక వేళ ఆ రికార్డులు కావాలంటే mro ఆఫీసులో ఉంటాయన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. మా మీద కొందరు నిరదరంగా ఆరోపణలు చేస్తున్నారు..మా కుటుంబానికి తప్పు చేయాల్సిన అవసరం లేదు..ప్రజలకు మా పై నమ్మకం ఉంది కాబట్టే ఇన్ని సార్లు ప్రజలు గెలిపించారన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి