వాలంటీర్లు ముందుండి వైసీపీ ప్రభుత్వాన్ని నడిపించాలి – పెద్దిరెడ్డి

-

వాలంటీర్లు ముందుండి వైసీపీ ప్రభుత్వాన్ని నడిపించాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు నియోజకవర్గం లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరుగింది. నియోజకవర్గం లోని సదుం మండలంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం,హాజరయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాలంటీర్లు గా నియమించడం కాకుండా మీకు సముచిత స్థానం కల్పించారు.

చిత్తూరు జిల్లాలో 8.6 కోట్లు, పుంగనూరు లో 1.98 కోట్లు వాలంటీర్లు కు వందనం ద్వారా అందించామని పేర్కొన్నారు. వర్షం వచ్చినా, పండగ అయినా ఉదయం 5 గంటలకే పెన్షన్ అందిస్తున్నారు… ప్రభుత్వ పథకాలను వాలంటీర్లు ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నారని వెల్లడించారు. గతం లో బాబు వస్తె జాబు వస్తుంది అని చెప్పి, అయన అధికారం లోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు.. జగన్ సిఎం అవ్వగానే 2.6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. వాలంటీర్లు తో కలిపితే మొత్తం 4 లక్షల మందికి సచివాలయాల ద్వారా ఉద్యోగాలు వచ్చాయి.. చంద్రబాబు నాయుడు వాలం టీర్లు అంటే పురుషులు లేనప్పుడు తలుపు తడుతారు అని అన్నారని గుర్తు చేశారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news