జగన్ సర్కార్ పై కేంద్రానికి రఘురామ ఫిర్యాదు చేశారు. అమరావతిలో ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర నిధులను మంజూరు చేయవద్దని కోరుతూ కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి హరిదీప్ సింగ్ పూరి గారికి లేఖ రాయడమే కాకుండా, ఆ లేఖ ప్రతిని ప్రధానమంత్రి గారి కార్యాలయానికి పంపినట్లుగా రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఇదే విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి గారిని అమరావతి రైతులతో కలిసి విన్నవిస్తాను. అమరావతిలో ఇళ్ళ నిర్మాణం కోర్టు ధిక్కరణ కిందికు వస్తుందని, కోర్టు తీర్పుకు లోబడి వ్యవహరించాలని, అమరావతిలో పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ స్థలాలపై ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ హక్కులను కల్పించ వద్దని ఉత్తర్వులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు.
అయినా అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన సెంటు స్థలాలలో అంటే కేవలం 48 గజాలలో ఇళ్ళను నిర్మించి అద్భుత కాలనీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అమరావతిలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజ్ వేయలేదని, కరెంటు సౌకర్యాన్ని కల్పించలేదని, అమరావతిలో రోడ్డు నిర్మాణం చేయాలంటే కనీసం 50 అడుగుల రోడ్డును నిర్మించాలని, అవేమీ లేకుండానే అద్భుత కాలనీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు చెవితే వినడానికి ప్రజలేమి చెవిలో పూలు పెట్టుకోలేదని అన్నారు.
ఇప్పటి వరకు అమరావతిలో లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించలేదని, 30 లక్షల ఇండ్ల ఇళ్ళ ఇచ్చానని చెబుతూ, కేవలం 5 ఇళ్ళను మాత్రమే జగన్ మోహన్ రెడ్డి గారు నిర్మించారని గత పార్లమెంట్ సమావేశాలలో కేంద్రమంత్రి గారు వెల్లడించారని అన్నారు. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వ్యక్తి కేవలం 5 ఇళ్లనే నిర్మించారంటే, పేదల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమవుతుందని అన్నారు. రాష్ట్రబ్వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను నిర్మించామని సాక్షి దినపత్రికలో రాశారని, ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మూడు లక్షల టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించలేదని, గృహ నిర్మాణ శాఖామంత్రి ఉన్నారో లేదో తెలియదని అన్నారు.