చంద్రబాబు తప్పులకు వేరే దేశంలో ఉరేసే వాళ్లు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లనే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. వైసీపీ హయాంలోనే ప్రాజెక్టులో మేజర్ వర్క్స్ పూర్తయ్యాయని.. స్పిల్ వే నిర్మించామని తెలిపారు. నదిని మళ్లించకుండా ఎవరైనా డయా ఫ్రం వాల్ కడతారా..? అని ప్రశ్నించారు.
అసమర్థత కాకపోతే నదిని డైవెర్ట్ చేయకుండా ఎవరైనా.. ఏ దేశంలో అయినా డయా ఫ్రం వాల్ కడతారా..? అని అడిగారు. చంద్రబాబు దుర్మార్గంగా చేసి.. ఇవాళ జగన్ మోహన్ రెడ్డి పై నెడుతున్నారు. అధికారంలో లేము కాబట్టి.. మాకు మీడియా బలం తక్కువ.. మీకు ఎక్కువ ఉందని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ ఎక్కువగా నిర్మించాం. కానీ కరోనా వల్ల కొద్ది రోజులు పనులు చేపట్టలేదని గుర్తు చేశారు అంబటి రాంబాబు.