ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి గా పేర్నీ నాని

-

ఆంధ్ర ప్ర‌దేశ్ మంత్రి పేర్నీ నాని అద‌న‌పు బాధ్య‌తల ను సీఎం జగ‌న్ అప్ప‌గించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి గా పేర్నీ నాని అద‌న‌పు బాధ్య‌తల ను అప్ప‌గిస్తూ సీఎం జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్నారు. కాగ మంత్రి పేర్నీ నాని ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ర‌వాణ‌, స‌మాచార శాఖ మంత్రిత్వ శాఖ‌ల బాధ్య‌తల‌ను చూస్తున్నారు. ఇప్ప‌టి నుంచి రవాణ‌, స‌మాచార శాఖ ల‌తో పాటు సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త ల‌ను పేర్నీ నాని చూడ‌నున్నారు.

దీనికి సంబంధించిన ఉత్త‌ర్వును కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో సినిమా రంగం వారికి, రాజ‌కీయ రంగం వారికి మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం నొల‌కొంది. సినిమా టికెట్ల ధ‌ర ల‌ను త‌గ్గిస్తూ ఎపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం ప్ర‌భుత్వానికి సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌ల మ‌ధ్య గ్యాప్ వచ్చింది. కాగ ఈ విష‌యం పై సినీ ప్ర‌ముఖులు ఎవరూ స్పందించినా.. వారి పై మంత్రి పేర్నీ నాని ఘాటు గా కౌంట‌ర్ వేస్తూ వ‌చ్చారు. దీంతో సినిమాటోగ్రఫీ మంత్రి గా పేర్నీ నాని ఉంటే.. దీనిపై ఇంకా ఫోక‌స్ పెట్టే అవ‌కాశాలు ఉంటాయ‌ని జ‌గ‌న్ భావించిన‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news