దేశంలో విస్తరిస్తున్న ఓమిక్రాన్… ఇప్పటి వరకు 64 కేసులు నమోదు..

-

దేశంలో ఓమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. విదేశాలకే పరిమితమైన కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు దేశంలో ప్రకంపనలు కలిగిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఓమిక్రాన్ కేసుల సంక్య 64కు చేరింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 కేసులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1 కేసు నమోదైంది. తెలంగాణకు ఇటీవల సోమాలియా, కెన్యా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రాగా.. శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఆ పరీక్షలో ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. మరొకరు హైదరాబాద్ మీదుగా బెంగాల్ వెళ్లిన 7 ఏళ్ల బాలుడికి కూడా ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చింది.

రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో 28 కేసులు నమోదవ్వగా… రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 6, గుజరాత్ లో 4, కర్ణాటకలో 3, తెలంగాణలో 2, కేరళ, ఏపీ, చంఢీగడ్ లో ఒక్కో కేసు నమోదైంది. ప్రపంచంలో ఇప్పట వరకు 77 దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది.

Read more RELATED
Recommended to you

Latest news