తన ఇంటి వద్ద జనసైనికులు చేసిన ఆందోళనపై స్పందించిన పేర్ని నాని… పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు. నీ ఉడత ఊపులకు బెదిరింపులకు బెదిరేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు ఇష్ట సారంగా సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారని… కులం లేదు మతం లేదు అని, హిందువులందరిని రెచ్చగొడుతూన్నారని ఆగ్రహించారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/09/perni-nani-pawan.webp)
తన వ్యాఖ్యలతో మతాలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని మీడియా సాక్షిగా ఎండ కట్టానని… బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ బాధ్యతలు మరిచి ప్రవర్తించటం సిగ్గుమాలిన పని కాదా అంటూ నిప్పులు చెరిగారు. నిన్న మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తే ప్లాన్ ప్రకారం కార్యకర్తలను నా ఇంటి పైకి పంపారని… ఇలాంటి చర్యలకు నేను వైఎస్ఆర్సిపి పార్టీ భయపడదని తెలిపారు. ఈ విషయం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గుర్తుపెట్టుకోవాలని కోరారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం మో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమని చురకలు అంటించారు.