చాకలి ఐలమ్మ జయంతి.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

-

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఆమె చిత్రాపఠానికి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గడీల వ్యవస్థపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ.. బహుజనుల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ఆమె ప్రతీక అని కొనియాడారు. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతేగాకుండా, ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలిని ఆశించారు.ఆమె మనువరాలు శ్వేతను మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా నియమిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వీరనారి చాకలి ఐలమ్మ పేరును కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ వారసులకు సముచిత గుర్తింపును కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news