ప్రత్యేక హోదా..ఏపీ ప్రజల చిరకాల కోరిక, ఆశ మరియు ఆశయం. అయితే.. అలాంటి ప్రత్యేక హోదాపై మరోసారి ఏపీ ప్రజలకు నిరాశే మిగిలింది. ఇవాళ ఏపీలో రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం బహిరంగ సభలో ప్రసగించారు మోడీ. కానీ.. ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
దీంతో ఏపీ ప్రజలు నిరాశ చెందుతున్నారు. విశాఖలో పోర్టుతో పాటు రైల్వే స్టేషన్ అభివృద్ధి.. దేశ అభివృద్ధిలో ఏపీది ప్రధాన భూమిక.. మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టు అనేది ప్రతి నగరానికి అవసరం అంటూ పై పై మాటలు చెప్పి తన ప్రసంగాన్ని ముగించేశారు ప్రధాని మోడీ.
Andhra Pradesh | Today, the country is making efforts on a large scale to realise the infinite possibilities associated with Blue Economy… Through port-led development we have improved opportunities greatly in India’s blue economy: PM Narendra Modi, in Visakhapatnam pic.twitter.com/TIIoH0pf6O
— ANI (@ANI) November 12, 2022