ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా పాలసీలు : సీఎం చంద్రబాబు

-

ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా పాలసీలు అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకేసారి ఆరు పాలసీలను తీసుకొచ్చాం. టూరిజం వంటి మరికొన్ని పాలసీలను తీసుకురావాల్సి ఉంది.   థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో యువత ముందుకెళ్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి. ఇంటికో ఎంటర్ ప్రెన్యూర్ ని తయారు చేయాలని భావిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ ఇన్నవేషన్ హబ్ గా ఉంటుంది. ఇక్కడ పుట్టిన వారు హైదరాబాద్, బెంగళూరు, అమెరికా ప్రాంతాల్లో ఉంటారు. ఎక్కడికైనా వెళ్లండి.. రాష్ట్రంలో ఫస్ట్ వర్క్ చేయండి అని సూచించారు. ఇండస్ట్రీలను తీసుకొస్తాం.. ఆదాయం తీసుకొస్తాం. ఆ ఆదాయాన్ని పేదలకు పంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినట్టుగానే 5 జోన్లకు 5 సెంటర్లు వస్తున్నాయని తెలిపారు. ఏపీ బ్రాండ్ డ్యామేజ్ అయింది. ప్రపంచానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version