పథకాలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానని ఇవ్వలేదు. రూ.15వేల రైతుబంధు అమలు చేయలేదు. ఆగస్టులో చేయాల్సిన చేప పిల్లల పంపిణీ అక్టోబర్ వచ్చినా చేయలేదు. కేసీఆర్ కిట్ కంటే మంచిది ఇస్తానని చెప్పి గర్భీణులను మోసం చేశారని మండిపడ్డారు. ఉన్న పథకాలను నిలిపివేయడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అన్నారు హరీశ్ రావు.
2024 దసరా పండుగ తెలంగాణ ఆడబిడ్డలను నిరుత్సాహ పరిచిందన్నారు. ఇచ్చిన హామీలన్ని గాలికి వదిలేసి బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. చేప పిల్లల కోసం తాము రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం 16కోట్లు మాత్రమే బడ్జెట్ లో ప్రవేశపెట్టిందన్నారు. చెరువులు నిండు కుండలా ఉన్నప్పటికీ చేప పిల్లలను సగమే పోయాలంటున్నారని.. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అని ఎద్దేవా చేశారు హరీశ్ రావు.