ఒంగోలులో టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురైన విషయం తెలిసిందే. పద్మ టవర్స్ లోని తన ఆఫీస్ లో వీరయ్య చౌదరి ఉన్న సమయంలో ఆయన పై దాడి జరిగింది. ముసుగు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో ఆయన పై దాడి చేశారు. ఈ ఘటన లో వీరయ్య చౌదరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి వీరయ్య చౌదరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు గుర్తించారు.
అయితే టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యలో రాజకీయ కోణం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న నాగులప్పపాడు మండలం వైసీపీ నాయకుడి పాత్ర పై అనుమానం వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం వ్యాపారం చేశాడు వైసీపీ నాయకుడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నాళ్లు అదే దందా కొనసాగించినట్టు సమాచారం. టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అతడినీ అడ్డుకున్నాడు వీరయ్య చౌదరి. అందుకోసమే అతన్ని హత్య చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుల కోసం మొత్తం 12 బృందాలతో గాలింపు చేపడుతున్నారు.