ఏపీ ప్రజలకు అలర్ట్‌..నేడు సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్

-

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 34 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 1కి పోలింగ్ ముగుస్తుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటిస్తారు.

ఖాళీగా ఉన్న 64 సర్పంచ్, 1001 వార్డు సభ్యుల స్థానాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగా… వాటిలో 30 సర్పంచ్, 756 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, విజయనగరంలో 5 సర్పంచ్ స్థానాలకు, 8 వార్డులకు నేడు ఎన్నికల నిర్వహణ జరుగనుంది.

6 సర్పంచ్ స్థానాలకు 30 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు వేశారు. ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా 5 సర్పంచ్ స్థానాలకు బరిలో 10 మంది ఉన్నానరు. 54 వార్డులకు 45 వార్డులు ఏకగ్రీవం కాగా 8 వార్డులకు 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అటు ఎన్టీఆర్ జిల్లాలో 3 పంచాయితీలు, కృష్ణాలో ఒక పంచాయితీకి నేడు ఎన్నికలు జరుగనున్నాఇయ. ఎన్టీఆర్ జిల్లాలో 12 వార్డు, కృష్ణాలో 8 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news