హైదరాబాద్ సిగలో ఇవాళ మరో మణిహారం కొలువుదీరబోతోంది. దక్షిణ భారత దేశంలోనే అతిపొడవైన స్టీల్ బ్రిడ్జ్‌గా పేరు గాంచిన ఇందిరా పార్కు ఉక్కు వంతెన ఇవాళ ప్రారంభం కానుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ముఖ్యంగా లోయర్ ట్యాంక్ బండ్‌లోని కట్ట మైసమ్మ దేవాలయం నుంచి ఇందిరాపార్కు ఎక్స్‌రోడ్ మధ్య స్టీల్ బ్రిడ్జి ప్రారంభం సందర్భంగా ఇవాళ ఉదయం 9 నుంచి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ నగర అదనపు ట్రాఫిక్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్కు ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్‌ను అనుమతి ఉండదని తెలిపారు.
కట్టమైసమ్మ దేవాలయం వద్ద లోయర్ ట్యాంక్‌బండ్, తహసీల్దార్ కార్యాలయం (ఎమ్మార్వో), స్విమ్మింగ్ ఫూల్, ఇందిరాపార్కు ఎక్స్ రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం వైపు వచ్చే ట్రాఫిక్‌కు నో ఎంట్రీ. ఇందిపార్కు ఎక్స్ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మింగ్ పూల్, తహసీల్దార్ కార్యాలయం (ఎమ్మార్వో), లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లించనున్నట్లు చెప్పారు.