లోకేష్ తిరుగుబోతు, తాగుబోతు..ఆయన లాగా వాలంటీర్లు ఎవరూ తిరగలేదన్నారు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణ మురళీ.ట్రాఫికింగ్ అంటే నీకు తెలుసా పవన్ కళ్యాణ్?శ్రీ కృష్ణుడు గోపిలలతో సరసాలు ఆడినట్లు చంద్రబాబు కొడుకు లోకేష్ సరసాలు ఆడాడు. అప్పుడు అడగలేదని ఆగ్రహించారు. భీమవరంలో ఎందుకు ఓడిపోయావో తెలుసా పవన్ కళ్యాణ్?.. రూ. 15 కోట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయొద్దని టీడీపీ వాళ్ళు భీమవరం ఓటర్లకు చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు.
చంద్రబాబు, ఆయన కొడుకు పుణ్యమా అని డేటా చోరీ జరిగిందని.. హైదరాబాద్ ఉన్నప్పుడు చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజల డేటా తీసుకున్నారని ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ తెలిసి తెలియక తప్పులు చేశాడు అని చిరంజీవి క్షమాపణలు చెప్పారని ఫైర్ అయ్యారు.చంద్రబాబు దృష్టిలో పవన్ ఓ వాన పాము.. మా దృష్టిలో మంచివాడన్నారు. పవన్ కళ్యాణ్ రియలైజ్ కాడు. ఎందుకంటే ఆయన మాటలు కాదు. చంద్రబాబు, ఇతరుల మాటలు అని ఆగ్రహించారు. వాళ్ళ ట్రాప్ లో పడి అందరికి దూరం అయ్యావు పవన్ కళ్యాణ్ అంటూ విరుచుకు పడ్డారు.