విశాఖపట్నం నుండి గోవా టూర్.. ఫ్లైట్ లో ఈ ప్రదేశాలన్నీ చూసి రావచ్చు..!

-

ఏదైనా మంచి టూర్ వేసేయాలి అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎంచక్కా గోవా వెళ్లి వచ్చేయచ్చు. ఐఆర్‌సీటీసీటూరిజం విశాఖపట్నం నుంచి గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. మరి ఇక పూర్తి వివరాల ని చూసేద్దాం. గోవాడిలైట్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది IRCTC. ఫ్లైట్‌ లో పర్యాటకుల్ని గోవా టూర్ తీసుకెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నార్త్ గోవా, సౌత్ గోవాతో పాటు గోవా బీచ్ లని కూడా చూసేయవచ్చు.

2023 అక్టోబర్ 20న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ టూర్ ఎలా సాగుతుందో చూసేద్దాం.. ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ మొదటి రోజు విశాఖపట్నంలో మొదలు కానుంది. పర్యాటకులు మధ్యాహ్నం 2.55 గంటలకు విశాఖపట్నం లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.55 గంటలకు గోవా రీచ్ అవుతారు. అక్కడ నుండి గోవాలోని ప్యారడైజ్ విలేజ్ బీచ్‌ కి తీసుకెళ్తారు.

రాత్రికి అక్కడే ఉండాలి. రెండో రోజు నార్త్ గోవా. అక్కడ ఫోర్ట్ ఆగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ ని చూసి రావచ్చు. అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ కూడా కవర్ అవుతాయి. మూడో రోజు ఖాళీ సమయం ఉంటుంది. పర్యాటకులు గోవాలో తిరగచ్చు. మఫ్సా మార్కెట్, పబ్స్‌కి కావాలంటే వెళ్లి రావచ్చు. నాలుగో రోజు సౌత్ గోవా టూర్.

ఓల్డ్ గోవా చర్చ్, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్ వంటివి నాల్గవ రోజు చూడచ్చు. మండోవీ నదిపై బోట్ క్రూజ్ కూడా ఉంటుంది. ఐదో రోజు గోవా నుంచి తిరుగు ప్రయాణం. మధ్యాహ్నం 3.40 గంటలకు గోవాలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నం వచ్చేస్తారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news