మేటర్ సీరియస్: బాలయ్యకు “పిన్ని” పోటు?

-

నెల్లురు జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్థానిక టీడీపీ నేతలు మొదట హడావిడి చేసినా.. “రెడ్ జోన్” కారణంగా కాం అయిపోయారని తెలుస్తోంది! ఈ క్రమంలో “ఎన్టీఆర్ విగ్రహాలపై నేడు చూపిస్తోన్న ప్రేమ.. ఆయన ఆశయాలపై కూడా చూపిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు” అని వినిపిస్తోన్న మాటల సంగతి కాసేపు పక్కనపెడితే… దీనిపై ఎన్టీఆర్ కుమారుడు, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.

ఈ విగ్రహం వ్యవహారంలో ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో చిన్నపాటి సమస్యగా మారిందనే ఉద్దేశ్యంతోనే స్థాన చలనం చేయాల్సి వస్తోంది తప్ప.. పూర్తిగా (విజయవాడలో వైఎస్ విగ్రాహాన్ని, జాతీయ నాయకుల విగ్రహాలను గొలగించినట్లుగా) తొలగించడం లేదని స్థానిక వైకాపా నేతలు చెబుతున్నారట! వీలైనంత తొందర్లో ఆ విగ్రహాన్ని మరింత ఘనంగా పునఃప్రతిష్ట చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి సూచనలు వెళ్లినట్లు చెబుతున్నారట!

ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో… కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి ఫోన్ చేశారు బాలయ్య. కావలిలో “ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విగ్రహం ఏర్పాటుచేయాలని… ఆ విగ్రహ పునఃప్రతిష్టకు తానే ముఖ్య అతిధిగా వస్తానని, తన చేతులమీదుగానే విగ్రహావిష్కరణ జరగాలని” ఆయనకు సూచించారని తెలుస్తోంది!!

అయితే… ఇప్పటికే “ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేస్తామనే” విషయాన్ని వైకాపా నేతలు చెప్పారని.. స్థాన మార్పిడే తప్ప తొలగింపు కాదని స్పష్టం చేశారని కోటంరెడ్డి.. బాలయ్యకు తెలిపినట్లు సమాచారం! ఇదే క్రమంలో… ఏమాత్రం అవకాశం ఉన్నా “పిన్ని” నందమూరి లక్ష్మీపార్వతిని ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కూడా పిలవాలని ప్లాన్స్ చేస్తున్నారని బాలయ్య దృష్టికి తెచ్చారని కావలిలో గుసగుసలు వినిపిస్తున్నాయి!

ఆ సంగతులు అలా ఉంటే… వారంతా ఎన్టీఆర్ పేరు, ఆస్తులు పంచుకోవడంలో వారసులు అయితే.. ఆయన ఆశయాలకు వారసుడిగా జగన్ నిలుస్తున్నారని.. మద్యపాన నిషేదాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారట వైకాపా నేతలు, “పెద్దాయన” అభిమానులు!

Read more RELATED
Recommended to you

Latest news