ప్రకాశం జిల్లా సత్తెనపల్లిలో ఒక దారుణం జరిగింది. భార్యా భర్తల మధ్య గొడవ జరగగా భార్య తలను నరికేసాడు ఒక భర్త. వివరాల్లోకి వెళితే రోజు మద్యం తాగి ఇంటికి వచ్చే భర్త… భార్యతో తరుచుగా ఏదోక విషయంలో గొడవ పడుతూ ఉంటాడు. ప్రతీ చిన్న విషయానికి కూడా ఆమెతో తగువు పడటంతో ఆమె కూడా అతనితో విసిగిపోయింది. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఈ గొడవలో భార్యను భర్త బాగా కొట్టాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గానూ వెళ్ళగా ఆమెను అడ్డుకున్న భర్త తలను కత్తితో నరికి ఆ తలను తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. పోలీసులు కూడా అతన్ని చూసి షాక్ అయ్యారు. కాసేపు అతన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు వెనుకడుగు వేసారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ ఘటన స్తానిక౦గా సంచలనం సృష్టించింది.