ఉచిత ఆర్టీసీ ప్రయాణం కోసం 1400 బస్సులు ఏర్పాటు – ఏపీ మంత్రి

-

మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం కోసం 1400 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు ఏపీ రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కడప నగరంలోని ఆర్టీసీ డిపోలో 17 నూతన బస్సులను ప్రారంభించిన రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…అనంతరం మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇది స్వర్ణ యుగమన్నారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీరమైందని వెల్లడించారు.

Provision of 1400 buses for free RTC travel for women

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు నెలలో ఆర్టీసీ ని గాడిలో పెట్టామని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలలో నిర్వీర్యం అయిన సంస్థ లను గాడిలో పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశమన్నారు. పింఛన్లు, రేషన్ పేదలకు ఎంత అవసరమో ఆర్టీసీ ప్రయాణం కూడా అంత ఆవసరమని… మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రస్తుతానికి 400 బస్సులు సిద్ధంగా ఉన్నాయి…మరో వెయ్యి బస్సులను తీసుకురావడం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news