కొత్త ఏడాది తొలిరోజే నింగిలోకి దూసుకెళ్లిన PLSV-C58

-

కొత్త ఏడాదికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఘనంగా స్వాగతం పలికింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఇవాళ పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహక నౌకను ప్రయోగించింది. షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహక నౌక ‘ఎక్స్‌-రే 480 కిలోల పొలారిమీటర్‌ ఉపగ్రహం’తో ఉదయం 9:10 గంటలకు నింగిలోకి  విజయవంతంగా దూసుకెళ్లింది. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగాన్ని చేపట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లని చెప్పారు.

2021లో ఐఎక్స్‌పీఈ పేరిట ఈ తరహా ప్రయోగాన్ని అమెరికా నిర్వహించింది. యూఎస్ తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన ఘనత భారత్‌ దక్కించుకుంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను అంతరిక్షంలోకి పంపినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుందని వెల్లడించారు. ఇందులో తిరువనంతపురం ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్‌ కాలేజ్‌ విద్యార్థినులు తయారు చేసిన విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news