ఊర్లో ఉండే ఈ వ్యాపారం చేయొచ్చు.. పెట్టుబడి కూడా తక్కువే..

-

వ్యాపారం చేయడానికి ప్రాంతం చాలా ముఖ్యం. మీ దగ్గర ఎంత పెట్టుబడి ఉన్నా.. వ్రాంగ్‌ ప్లేస్లో వ్యాపారం చేస్తే అది క్లిక్‌ అవదు. కొన్ని సిటీలోనే చేయాల్సి ఉంటుంది. మరికొన్ని పల్లెల్లోనే చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో చేసే వ్యాపారాలు కూడా భారీగా సంపాదించవచ్చు. యానిమల్ ఫీడ్ (Animal feed) తయారు చేసే బిజినెస్‌తో దండిగా సంపాదించవచ్చు.

ఇది ఏడాది పొడవునా చేసే లాభదాయకమైన వ్యాపారం. పర్యావరణానికి మేలు చేసే ఫీడ్‌ని తయారు చేయడానికి మొక్కజొన్న పొట్టు, గోధుమ ఊక, గింజలు, గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఉపయోగించవచ్చు. వ్యర్థ పదార్థాలతో హై క్వాలిటీ పశుగ్రాసాన్ని తయారుచేసి ఎక్కువ ప్రాఫిట్ పొందవచ్చు.

ఈ బిజినెస్ ప్రారంభించడం చాలా సింపుల్, అలాగే ఆపరేట్ చేయడం కూడా సులభమే. పశుగ్రాసానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పశుగ్రాసం తయారీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, అవసరమైన లైసెన్స్‌లు, అనుమతులు కలిసి ఉంటుంది. పరిశ్రమ నియమాలు, నిబంధనలను కూడా అనుసరించాలి. ఈ వ్యాపారం ముఖ్యంగా పాడి రైతులకు అనువుగా ఉంటుంది. లైసెన్స్‌లతో పాటు వ్యాపారాన్ని ఆపరేట్ చేయడానికి ఒక స్థలం అద్దెకు తీసుకోవాలి. ఈ బిజినెస్‌కు పెట్టుబడి తక్కువే.

సొంతంగా పశుగ్రాసం తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తుల కోసం ప్రభుత్వ రుణాలు అందుబాటులో ఉన్నాయి. వారు ప్రధాన మంత్రి ముద్రా యోజన (Pradhan Mantri Mudra Yojana) కింద రూ.10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ డబ్బును ఫీడ్ గ్రైండర్లు, పశువుల మేత యంత్రాలు (Cattle feed machines), మిక్సర్లు, బరువు కొలిచే పరికరాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.

ఇండియాలో పశువుల పరిశ్రమకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. పశుగ్రాసం కోసం డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అందువల్ల ఈ వ్యాపారం చాలా ప్రాఫిట్స్ తెచ్చి పెడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ (Animal husbandry)కు పెరుగుతున్న ఆదరణ కూడా అనేక అవకాశాలను సృష్టిస్తుంది. అయితే వ్యాపారం మొదట్లో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కసారి క్లిక్‌ అయిందంటే.. ఎక్కువమంది కస్టమర్లకు పశుగ్రాసాన్ని విక్రయించవచ్చు.

ఈ లైసెన్సులు తప్పనిసరి :

యానిమల్ ఫీడ్ తయారీ (Animal Fodder Farm) వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు వ్యాపారాన్ని ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి ఫుడ్ లైసెన్స్ (Food license) పొందాలి. GST రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి.
ఎన్విరాన్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ పొందడం కూడా అవసరమే. పశుసంవర్ధక శాఖ నుంచి (Animal Husbandry Department) లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సొంత బ్రాండ్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ట్రేడ్‌మార్క్‌ను రిజిస్టర్ చేసుకోవాలి, BIS సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news