వేదవ సోది ఆపి, కాస్త కొవ్వు తగ్గించుకో అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నానికి పీవీపీ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధిష్టానానికి విజయవాడ ఎంపీ, ఆ పార్టీ నేత కేశినేని పరోక్షంగా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికలలో పోటీపై స్పందించారు. వచ్చే ఎన్నికలలో తనకి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే.. కేశినేని చేసిన వ్యాఖ్యలపై పీవీపీ స్పందించారు. నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు.. ఉందని చురకలు అంటించారు పీవీపీ. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని,జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి,కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు!! అంటూ ట్వీట్ చేశారు పీవీపీ.