జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం – రఘురామ

-

జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇన్నాళ్లు తన ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. రానున్న ఎన్నికలు జగన్ మోహన్ రెడ్డి గారు కావాలా?, వద్దా?? అన్న ప్రజాభిప్రాయం కోసమే జరగనున్నాయన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ మోహన్ రెడ్డి వద్దని, అతన్ని ఎదిరించాలనే ఉద్దేశంతోనే ఇతర పార్టీలతో జత కట్టారన్నారు.

Ysrcp rebel mp raghurama raju finally entered in To Andhra Pradesh

తనకు ఎంత ప్రజాభిమానం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపారన్నారు. కూటమిలో బీజేపీ కూడా కలవాలని అందరికీ తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తే, ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానన్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని, ఇప్పుడు తాను ఏమి మాట్లాడినా అపార్థం చేసుకునే పరిస్థితి ఉందన్నారు. అందుకనే ఏమీ మాట్లాడడం లేదని రఘురామకృష్ణ రాజు గారు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news