మహాత్మా గాంధీ గారు చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ జగన్, క్విట్ వైకాపా అనే శాంతియుత ఉద్యమాన్ని చేపడుదామని, అదే గాంధీజీ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా అధికారంలో నుంచి దించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నేతృత్వంలోని కూటమికి ఓటు వేసి ఇప్పుడు మనం మనసులో తీసుకున్న నిర్ణయాన్ని విజయవంతం చేయాల కోరారు.
ఆంగ్లేయుల రాచరికపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని ఉద్దేశంతో 1890 లో 124A సెడిషన్ చట్టాన్ని తీసుకువచ్చారని, ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రేరేపించేలా వ్యవహరించారనే ఉద్దేశంతో 1922 లో మహాత్మా గాంధీ గారుపై ఈ చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేసి, ఆరేళ్ల పాటు ఆయనకు జైలు శిక్ష విధించారని తెలిపారు. అయితే జైలులో ఆయన శాంతియుత నిరసనలను చూసి భయపడి, రెండేళ్లకే విడుదల చేశారని, అత్యంత కిరాతకమైన బ్రిటిష్ రాచరికపు ప్రభుత్వమే సెడిషన్ చట్టం కింద అరెస్ట్ అయిన గాంధీజీ గారిని కొట్టేందుకు సాహసించలేదని వెల్లడించారు.