ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అంటూ తాజాగా సజ్జల చేసిన వ్యాఖ్యలతో విపక్షాలు అన్నీ ముందే ఎన్నికలు ఉంటాయని యుద్ధానికి రెడీ అవుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో టిడిపి -జనసేన మధ్య పొత్తు ఉంటుందని స్పష్టత వచ్చేసింది. ఇక లెక్క తేల్చాల్సింది బీజేపీ మాత్రమే. అయితే తాజాగా ఈ పొత్తులపై వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి -జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటమి ఖాయం అంటున్నారు రఘురామ.
వచ్చే ఎన్నికల్లో తనకు ఉన్న సమాచారం మేరకు -టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని.. దీంతో కచ్చితంగా వైసిపి ఓడిపోతుందని లెక్కలు ఉన్నాయని అంటున్నారు. అందులో ఎవరు ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదంటున్నారు రఘురామ. ఆ భయం వైసీపీ నేతల్లో క్లియర్ గా కనిపిస్తుందని అన్నారు. ప్రభుత్వ పరిపాలన బాగుంటే ప్రజలు ఓటేస్తారు లేదంటే లేదు… అని రఘురామ పేర్కొన్నారు. అయితే ఆయన కూడా అదే ధీమాతో రాజీనామాకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం ఉంది. రెండు పార్టీల పొత్తు ఖరారైన తర్వాత రఘురామ తన ఎంపీ పదవికి తోపాటు వైసిపి కి రాజీనామా చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.