ఎండల మండిపోతున్నాయి.. అసలు ఈ సమ్మర్ లో అర్జెంట్ గా బయటకు వెళ్లాల్సిన పని పడితే కార్లు ఉన్నవారైతే హ్యాపీగా వెళ్తారు.. మరి అవి లేని వారి పరిస్థితి.. ఏ ఆటోనో, బస్సో చూసుకోవాలి. వీటిల్లో కుర్చోని మండుటెండలో వెళ్తుంటే ఎక్కడ వడదెబ్బతో పోతామేమో అనిపిస్తుంది కదా.. లోపల మంట.. బయట వేడిగాలి, చెమట.. ఛీ దీనమ్మా జీవితం.. ఎప్పుడు పోతుందిరా ఈ ఎండాకాలం అని టెంపర్ లేస్తది.. కానీ ఇలాంటి సమ్మర్ లో ఆ ఆటోలో కుర్చుంటే మీకు చలిపెడుతుంది కూడా.. అంత కూల్ గా ఉంటుంది. ప్రయాణికుల కోసం ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలచోన చేశాడు. అదేంటో మీరు చూడండి.!
వేసవిలో తన ఆటోలో ప్రయాణిస్తున్న వారికి చల్లగా ఉండేందుకు ఆటో కప్పుపై అతను పచ్చని మొక్కలను ఏర్పాటు చేశాడు. దిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల తాకినప్పటికీ.. తన ఆటోలో ప్రయాణించేవారికి మాత్రం చల్లగానే ఉంటుందని ఆటో డ్రైవర్ అంటున్నాడు.
రెండేళ్ల కిందట వేసవి కాలంలో తనకు ఈ ఆలోచన వచ్చిందట… దీంతో ఆటోకప్పుపై కొన్ని మొ.క్కలను పెంచితే బాగుంటుందని అతను భావించాడు. అంతే వెంటనే ఆటో కప్పుపై మొక్కలను పెంచాడు.. దీని కారణంగా అతని ఆటోలో ప్రయాణించే వారికి ఎండవేడి నుంచి ఉపశమనం కలుగుతోంది. దీనికి తోడు సదరు ఆటో డ్రైవర్ ఆటో లోపల రెండు మినీ కూలర్లు, ఫ్యాన్లు కూడా అమర్చాడు.
ఇలా చేయటం వల్ల ప్రయాణికులకు సహజమైన ఏసీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ప్రయాణీకులు రైడ్ తర్వాత చాలా సంతోషంగా ఉన్నారని, దీనికి గాను అదనంగా చెల్లించేందుకు కూడా వారు ఎటువంటి ఇబ్బంది పడటం లేదని ఆటో డ్రైవర్ చెప్తున్నాడు.
నిజానికి ఇలా చేయడానికి పెద్దగా ఖర్చుపెట్టక్కర్లేదు.. చిన్న పని అయినా పెద్ద లాభం అంటే ఇదేనేమో.. అసలు ఆటో డ్రైవర్లు అంతా ఇలాంటి ప్రత్యామ్నాయాలు చూసుకుంటే.. సమ్మర్ లో కూడా ఎండబారిన పడుకుండా వ్యాపారం చేసుకోవచ్చు. అంటు డ్రైవర్ కి ఇటు ప్రయాణికులకు ఇద్దరికి బాగుంటుంది కదా..!
-Triveni Buskarowthu