కోడి కత్తి, గొడ్డలి ద్వారా సీఎం జగన్‌ కేక్‌ కట్‌ చేయాలి – వైసీపీ ఎంపీ

-

వైకాపా అధికారంలోకి రావడానికి కోడి కత్తి కేసు, బాబాయ్ హత్య వంటి ఘటన ప్రజల్లో సెంటిమెంటును రాజేశాయని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన జన్మ దినోత్సవ కేక్ ను కోడి కత్తి, గొడ్డలి ద్వారా కట్ చేస్తే… తన విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆ రెండు ఘటనలని గుర్తు చేసుకున్నట్లు అవుతుందని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు.

Jagan successfully failed MP Raghurama Krishnam Raju's plan
raghurama on cm jagan birthday

జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గర్వంగా జరుపుకునే ఆఖరి పుట్టినరోజు ఇదే అవుతుందని, జగన్ మోహన్ రెడ్డి గతి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అప్పుడే కొంత మంది వ్యక్తులు సాక్షి దినపత్రికలో జగన్ సార్ వన్స్ మోర్ అని అడ్వర్టైజ్మెంట్లను వేయిస్తున్నారని, కానీ ప్రజలు మాత్రం జగన్ సార్ నో మోర్ అని తమ మనసుల్లో అనుకుంటున్నారని తెలిపారు.

ఇక భవిష్యత్తులో జరుపుకునే పుట్టిన రోజు వేడుకలకు సాక్షి దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్లు వేసేవారు ఉండరని, సాక్షి యాజమాన్యమే ఎవరో ఒకరి పేరిట అడ్వర్టైజ్మెంట్లు వేసే దుస్థితి నెలకొంటుందని అన్నారు. మద్య నిషేధం గురించి గతంలో మంత్రి రోజా గారు చేసిన ప్రసంగం వీడియో ఫుటేజ్ ను ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news