సాక్షిని జగన్ మోహన్ రెడ్డి ప్రభావితం చేస్తున్నాడని రఘురామరామ కృష్ణం రాజు సంచలన పోస్ట్ పెట్టాడు. మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి కేసులో సాక్షి అయిన ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం గారిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభావితం చేస్తున్నట్టుగా స్పష్టమవుతుందని, ఒక విష వలయంలో చిక్కుకున్న అజయ్ కల్లం గారి ఆవేదన అర్థమవుతూనే ఉందని, సీబీఐ అధికారులు తన వద్దకు వచ్చి 161 స్టేట్మెంట్ నమోదు చేశారని చెబుతూనే, ఒక అధికారి మాత్రమే తన వద్దకు వచ్చారని పేర్కొనడం వింతగా ఉందని అన్నారు. ఎస్పీ స్థాయి అధికారి తన ఇంటికి వచ్చినట్లు అజయ్ కల్లం గారు తెలిపారని పేర్కొన్నారు.
ఎస్పీ స్థాయి అధికారి వెంట మరొక అధికారి ఉండడం సహజమని, ఎందుకంటే సాక్షి ఇచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేసి, ఆయనకు తిరిగి చూపెట్టడానికి మరొక అధికారి సహాయం చేస్తుంటారని అన్నారు. 161 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తాను ఈ కేసులో సాక్షిని కాదని ఐఏఎస్ ఉత్తీర్ణుడై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఒక వ్యక్తి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 161 స్టేట్మెంటును ఇచ్చానని చెబుతూనే, తనతో సీబీఐ అధికారులు చిట్ చాట్ గా మాట్లాడారని పేర్కొనడమే వింతగా ఉందని, దానికి సాక్షి దినపత్రిక వంత పాడుతూ వార్తా కథనం రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి సమాచారం తెలిసి, వై.యస్. వివేకానంద రెడ్డి గారు నో మోర్ అని తనతో పాటు సమావేశమైన వ్యక్తులకు చెప్పారని అజయ్ కల్లం గారు అంగీకరించారని అన్నారు. ఈ విషయాన్ని తనతో సమావేశమైన వ్యక్తులతో నాలుగున్నర గంటల ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని చెప్పారని, గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మరణించినట్లుగా తమతో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అజయ్ కల్లం గారు చెబితే, జగన్ మోహన్ రెడ్డి గారి చాప్టర్ క్లోజ్ అని, ఇందులో ఎటువంటి అనుమానము లేదని అన్నారు.